Homeజిల్లాలుకామారెడ్డిliquor tenders | మద్యం టెండర్లకు 193 దరఖాస్తులు

liquor tenders | మద్యం టెండర్లకు 193 దరఖాస్తులు

కామారెడ్డి జిల్లాలో మద్యం షాపుల టెండర్లకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 193 అప్లికేషన్లు వచ్చాయని ఎక్సైజ్​ అధికారులు తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: liquor tenders | జిల్లాలో 49 మద్యం షాపులకు (liquor shops) దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం వరకు 106 దరఖాస్తులు రాగా సోమవారం, మంగళవారం రెండు రోజుల్లోనే 83 దరఖాస్తులు వచ్చాయి.

జిల్లాలోని కామారెడ్డి స్టేషన్ (Kamareddy station) ఫరిదిలో మొత్తం 15 వైన్ షాపులకు 54 దరఖాస్తులు, దోమకొండ స్టేషన్ పరిధిలో 8 దుకాణాలకు 32, ఎల్లారెడ్డి (Yellareddy) పరిధిలో మొత్తం 7 వైన్ షాపులకు 25, బాన్సువాడ పరిధిలో 9 దుకాణాలకు 44, బిచ్కుంద పరిధిలో 10 వైన్ షాపులకు 38 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉందని, ఆసక్తి కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్ రావు కోరారు.