HomeతెలంగాణLand Scam | 176 ఎకరాల భూ కుంభకోణం.. ఆ ఎంపీ హస్తం.. విచారణ షురూ..!​

Land Scam | 176 ఎకరాల భూ కుంభకోణం.. ఆ ఎంపీ హస్తం.. విచారణ షురూ..!​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Scam | రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ కుంభకోణంలో ఓ జాతీయ పార్టీకి చెందిన ఎంపీ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

సిద్దిపేట siddipeta జిల్లాలో 176 ఎకరాల భూ కుంభకోణం land scam ఆరోపణలపై కలెక్టర్​ మను చౌదరి Collector Manu Chowdhury స్పందించారు. ఆ ఆరోపణలపై విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి Akbarpet-Bhoompally మండలం చౌదరిపల్లి Chowdhurypalli గ్రామంలోని 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కామ్​పై వాస్తవాలను నిగ్గు తేల్చాలని కలెక్టర్​ నిర్ణయించారు. దీనికోసం నలుగురు రెవెన్యూ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

ఈ గ్రామంలో సర్వే నంబర్‌ 294లోని కొన్ని బై నంబర్ల భూమి మీద వివాదం ఏర్పడిన నేపథ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కమిటీ సభ్యులు భూ వివాదం, దాని స్వభావంపై పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వన్నారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ తెలిపారు.

Land Scam | ఎంపీపై ఆరోపణలు

కాగా.. ఓ జాతీయ పార్టీకి చెందిన ఎంపీ MP అక్రమంగా 176 ఎకరాల పేద రైతుల అస్సైన్డ్ భూములు assigned lands స్వాహా చేశారని ఇటీవల సోషల్​ మీడియా social media లో ప్రచారం జరిగింది. సదరు ఎంపీ ఆ భూమిని కూతురు, భార్య పేరిట రిజిస్ట్రేషన్​ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేగాకుండా అసైన్డ్​ భూమిని పట్టా భూమిగా మార్చారని ఆరోపణలు ఉన్నాయి. కాగా.. ఈ దందాపై పలువురు రైతులు కలెక్టర్​కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రైతుల ఫిర్యాదు, సోషల్​ మీడియాలో ప్రచారం నేపథ్యంలో కలెక్టర్​ స్పందించారు. విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కమిటీని నియమించారు.

Must Read
Related News