అక్షరటుడే, కామారెడ్డి: Drunk and Drive | జిల్లాలో ఎక్కడికక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. మందుబాబుల వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కోర్టులో జరిమానా (fines) చెల్లించిన తర్వాతే విడుదల చేస్తున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులో జరిమానాలు చెల్లించి వాహనాలను తీసుకెళ్తున్నారు.
Drunk and Drive | 141 మంది జరిమానాలు..
తాజాగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పట్టుబడిన 141 మందికి న్యాయస్థానాలు జరిమానాలు, శిక్షలు విధించింది. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ (Kamareddy Town Police Station) పరిధిలో ఒకరికి 2 రోజు జైలుశిక్ష విధించగా 12 మందికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు రూ.1000 చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Drunk and Drive | భిక్కనూరు పోలీస్స్టేషన్ పరిధిలో..
అలాగే భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరికి ఒకరోజు జైలు శిక్షతో పాటు వెయ్యి చొప్పున జరిమానా, దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి ఒకరోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి ఒకరోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది.
Drunk and Drive | కామారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో..
అలాగే కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 73 మందికి మొత్తం రూ.76 వేలు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందికి రూ.11 వేలు, మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురికి రూ.5వేలు, రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరికి రూ.2 వేలు, భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18 మందికి రూ.20 వేలు, దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురికి రూ.6వేలు, బీబీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురికి రూ.4వేలు, సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురికి రూ.7వేల జరిమానాలు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
Drunk and Drive | మద్యం తాగి వాహనాలు నడిపితే అంతే..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 141 కేసులు నమోదు కాగా మొత్తం రూ.1.48 లక్షల జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. వాహనదారులు తమ కుటుంబాన్ని, ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించి వాహనం నడపవద్దన్నారు. ఒక్కరి నిర్లక్ష్యం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని, మరికొందరు వికలాంగులై జీవితాంతం బాధపడుతున్నారన్నారు. వాహనదారులు గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే కామారెడ్డి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.