HomeUncategorizedMHSRB Jobs | వైద్యశాఖలో 1623 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ

MHSRB Jobs | వైద్యశాఖలో 1623 ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MHSRB Jobs | తెలంగాణలోని మెడికల్‌ హెల్త్‌ సర్వీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(MHSRB) వైద్య శాఖలో ఖాళీల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, మెడికల్‌ ఆఫీసర్‌(Medical officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గలవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలు తెలుసుకుందామా..

మొత్తం పోస్టులు : 1,623. (మల్టీ జోన్‌ -1 లో 858, మల్టీ జోన్‌ – 2 లో 765 పోస్టులను భర్తీ చేయనున్నారు.)

పోస్టుల వివరాలు..
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(TVVP)లో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, జనరల్‌ మెడిసిన్‌, సర్జరీ, ఆర్థోపెడిక్‌, ఈఎన్టీ, రేడియాలజీ, కంటి, చర్మ వ్యాధులు, పాథాలజీ, సైకియాట్రీ, లంగ్స్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వంటి విభాగాలలో పోస్టులున్నాయి.

టీజీఎస్‌ఆర్టీసీ(TGSRTC)లో అనస్థీషియా, మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, కంటి, పిల్లల వైద్య విభాగం, లంగ్స్‌, రేడియాలజీ పోస్టులను భర్తీ చేస్తారు.

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషాలిటీ విభాగంలో పీజీ/డిప్లొమా/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి 46 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌(EWS) అభ్యర్థులకు ఐదేళ్లు, పీవోడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వేతనం వివరాలు :
టీవీవీపీలో నెలకు రూ. 58,550 నుంచి రూ. 1,37,050 వరకు వేతనం చెల్లిస్తారు.
టీజీఎస్‌ఆర్‌టీసీలో వేతనం రూ. 56,500 నుంచి రూ. 1,31,000 వరకు అందుతుంది.

దరఖాస్తు ప్రక్రియ : ఆన్‌లైన్‌ ద్వారా..
దరఖాస్తు రుసుము : రూ. 500.
ప్రాసెసింగ్‌ ఫీజు : జనరల్‌ అభ్యర్థులకు రూ. 200. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఫిజికల్లీ హ్యాండీక్యాప్‌డ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, నిరుద్యోగ యువతకు ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు ఉంటుంది)

దరఖాస్తు గడువు : సెప్టెంబర్‌ 22.
ఎంపిక విధానం : విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌(Merit) ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం (https://mhsrb.telangana.gov.in) సంప్రదించండి.

Must Read
Related News