అక్షరటుడే, వెబ్డెస్క్: Special Trains | తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ (Sankranti Festival)ను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి వేడులకు వైభవంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు పండుగకు సొంతూళ్లకు వెళ్తారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో లక్షలాది మంది ఆంధ్ర ప్రజలు నివసిస్తారు. వీరు పండుగకు తమ ఊళ్లకు వెళ్తుంటారు. చాలా మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. అయితే సంక్రాంతి పండుగకు టికెట్లు దొరకడం కష్టం. ఈ క్రమంలో పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels), ఆర్టీసీ బస్సుల్లో వెళ్తుంటారు. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ (Railway Department) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. 16 అదనపు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Special Trains | జనవరి 9 నుంచి..
ప్రత్యేక రైళ్లు జనవరి 9 నుంచి 19 తేదీల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. వికారాబాద్-శ్రీకాకుళం రోడ్(07294), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్ (07295), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్(07290), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07291), సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్ (07288), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07289), సికింద్రాబాద్- శ్రీకాకుళం రోడ్(07292), శ్రీకాకుళం రోడ్-సికింద్రాబాద్(07293) రైళ్లను అధికారులు నడపనున్నారు. రైలు నెంబర్ 07288 జనవరి 9, 11 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి వెళ్తుంది. 07290 నంబర్ రైలు జనవరి 10, 12, 16, 18 తేదీల్లో, 07291 ట్రైన్ 11, 13, 17, 19 తేదీల్లో రాకపోకలు సాగించనుంది.
సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్ మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లకు చర్లపల్లి, కాజిపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో స్టాప్ సౌకర్యం ఉంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.