అక్షరటుడే, కామారెడ్డి: Wine shops | జిల్లాలో 49 మద్యం షాపులకు టెండర్ల కోసం 1,502 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్ రావు (Excise Department) తెలిపారు. నూతన మద్యం దుకాణాల లైసెన్సదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 23తో ముగిసిందన్నారు.
కామారెడ్డి(Kamareddy) స్టేషన్ పరిధిలో 15 మద్యం దుకాణాలకు 467దరఖాస్తులు, దోమకొండ (Domakonda) పరిధిలో 8 మద్యం దుకాణాలకు 317, ఎల్లారెడ్డి(Yellareddy) పరిధిలో 7 మద్యం దుకాణాలకు 236, బాన్సువాడ పరిధిలో 9 మద్యం దుకాణాలకు 249, బిచ్కుంద పరిధిలో 10 మద్యం దుకాణాలకు 233 దరఖాస్తులు వచ్చాయన్నారు.
ఈనెల 27న కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల రేణుకా దేవి కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటలకు డ్రా పద్దతిలో లైసెన్స్ దారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఎంపికైన లైసెన్స్‌దారులు అదేరోజు 1/6వ వంతు లైసెన్స్ ఫీజును రేణుకా దేవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్లో చెల్లించాలని సూచించారు.

