HomeజాతీయంVande Mataram | వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. భారత ఆత్మను మేల్కొలిపిన నినాదానికి ఘన...

Vande Mataram | వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. భారత ఆత్మను మేల్కొలిపిన నినాదానికి ఘన నివాళి

భారతదేశంలో వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం జోరుగా సాగుతున్న ఆ కాలంలో ‘వందేమాతరం’ నినాదం మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా నిలిపింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vande Mataram | “వందేమాతరం!” .. ఈ నినాదం భారత స్వాతంత్య్ర‌ సమరానికి ప్రాణం పోశాయి. కోట్లాది భారతీయుల గుండెల్లో జాతి గౌరవం, ఐక్యత, స్వేచ్ఛా భావం నింపిన ఈ నినాదానికి నేడు 150 సంవత్సరాలు పూర్తయ్యాయి.

1875 నవంబర్ 7న బంకిమ్‌చంద్ర ఛటర్జీ (Bankim Chandra Chatterjee) రచించిన వందేమాతరం గీతం తొలిసారిగా బంగా దర్శన్ (Banga Darshan) అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. ఆ తర్వాత ఆయన రచించిన ప్రముఖ నవల “ఆనందమఠ్” (Ananda Math) ద్వారా ఈ గీతం దేశమంతా వ్యాపించింది. స్వాతంత్య్ర‌ ఉద్యమంలో ఇది కేవలం గీతం కాదు, ఒక ఉద్యమానికి ప్రేరణ, ఒక జాతి ఆత్మకు ప్రతీకగా మారింది.

Vande Mataram | జాతిని ఏకం చేసిన గీతం

ఈ గీతం భారతీయుల మనసులో భిన్నత్వంలో ఏకత్వం, పుట్టిన నేలపై గర్వం, దేశభక్తి అనే మూడు ప్రధాన సూత్రాలను నాటింది. వలస పాలనలో అణగారిన భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని రగిలించింది. ఈ గీతాన్ని విన్న ప్రతిసారి ఇప్పటికీ ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగడం దాని శాశ్వత శక్తిని చూపిస్తుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనుంది. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు జరిగే ఈ వేడుకలకు సాంస్కృతిక శాఖ సమగ్ర ప్రణాళిక రూపొందించింది.

భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి నేటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం (Vande Mataram Song) 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 2025 నవంబర్ 7వ తేదీన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.ఈ సందర్భంగా ప్రధాని మోదీ (Prime Minister Modi) పిలుపునిస్తూ ..“ఈ రోజు ఉదయం 9:50 గంటలకు ప్రతి భారతీయుడు ఎక్కడ ఉన్నా నిలబడి వందేమాతరాన్ని ఆలపించాలి. మన గుండెల్లో జాతి గర్వం మరింత గట్టిగా మారాలి” అని ట్వీట్‌ చేశారు. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ , స్వాతంత్య్ర స‌మరంలో వందేమాతరం చారిత్రక పాత్ర పోషించింది” అని పేర్కొంటూ, జాతీయ గీతం ‘జనగణమన’తో సమానంగా వందేమాతరానికి గౌరవం ఇవ్వాలని నిర్ణయించారు. 150 సంవత్సరాల తర్వాత కూడా వందేమాతరం జాతి గౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తూనే ఉంది. స్వేచ్ఛా స్పూర్తిని గుర్తుచేసే ఈ గీతం మరోసారి భారతీయుల గుండెల్లో ప్రతిధ్వనించబోతోంది.

Must Read
Related News