ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Parking Space | పార్కింగ్​ కోసం 15 అంతస్తుల బిల్డింగ్​.. నాంపల్లిలో త్వరలో అందుబాటులోకి..

    Parking Space | పార్కింగ్​ కోసం 15 అంతస్తుల బిల్డింగ్​.. నాంపల్లిలో త్వరలో అందుబాటులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Parking Space | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ట్రాఫిక్​ కష్టాలు అన్ని ఇన్ని కావు. నగరం రోజు రోజుకు విస్తరిస్తుండటంతో రద్దీ కూడా పెరుగుతోంది. ముఖ్యంగా బయటకు వెళ్లిన సమయంలో పార్కింగ్​ (Parking)కు స్థలాలు లేక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. తమ వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్​ జామ్ (Traffic Jam)​ అవుతోంది. కుటుంబంతో సరదాగా బయటకు వెళ్లి తమ బండ్లను ఎక్కడ నిలపాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో నగరవాసుల పార్కింగ్​ కష్టాలు తీరేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నాంపల్లిలో 15 అంతస్తుల భవనంలో పార్కింగ్​ కోసం ఏర్పాట్లు చేశారు.

    నాంపల్లిలో ప్రభుత్వ, ప్రైవేట్​ భాగస్వామ్యంతో 15 అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. దీనిని నోవమ్ కంపెనీ నిర్మిస్తుండగా.. హైదరాబాద్​ మెట్రో రైల్​ లిమిటెడ్​ (HMRL) పర్యవేక్షిస్తోంది. ఈ భవనంలో 10 అంతస్తులను పార్కింగ్​ కోసం వినియోగించనున్నారు. ఐదు అంతస్తులను కమర్షియల్ స్పేస్​ కోసం అద్దెకు ఇస్తారు. ఈ భవనం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలో పది భవనంలో పార్కింగ్​ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన భవనంలో పనులను పరిశీలించారు. పలు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. పర్మిషన్లు వచ్చాక.. భవనాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు.

    Parking Space | ఆటోమేటెడ్ పార్కింగ్ వ్యవస్థ

    ఇది ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ అని, నాంపల్లి (Nampalli) ప్రాంతంలోని పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఉపయోగ పడుతుందని ఎన్వీఎస్​ రెడ్డి అన్నారు. కాగా ఈ భవనంలో జర్మన్ (German) పాలిస్ టెక్నాలజీని ఉపయోగించి పూర్తిగా ఆటోమేటెడ్ పజిల్ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి తేనున్నారు. భారత్​లో ఈ రకం పార్కింగ్ వ్యవస్థ హైదరాబాద్​లోనే మొదట అందుబాటులోకి రానుంది. ఈ కాంప్లెక్స్​లో 10 పార్కింగ్ అంతస్తులు (3 బేస్‌మెంట్‌లు, 7 పై అంతస్తులు) ఉంటాయి. మరో ఐదు అంతస్తులను వాణిజ్య కార్యకలాపాల కోసం కేటాయించనున్నారు. 11వ అంతస్తులో సినిమా థియేటర్లు, సిటీ-వ్యూ గ్యాలరీ ఏర్పాటు చేస్తారు.

    Parking Space | 250 కార్లు.. 200 బైక్​లు

    ఈ భవనంలో మొత్తం 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలను పార్క్​ చేయొచ్చు. మానవ ప్రమేయం లేకుండా సెన్సార్ల సాయంతో ఆటోమేటిక్​గా పార్కింగ్​ చేసేలా రూపొందించారు. కారు లోనికి తీసుకెళ్లడానికి కార్డు స్వైప్​ చేయాలి. అనంతరం కారును టర్న్ టేబుల్‌పై ఉంచి, హ్యాండ్‌బ్రేక్‌ను వేస్తే ఆటోమేటిక్​గా పార్కింగ్​ అయిపోతుంది.

    Latest articles

    Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారుండరు. పిజ్జా(Pizza), బర్గర్లు(Burgers),...

    Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు (EWS Reservations) అమలు చేయాలని ఓసీ...

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...

    Women safety | మహిళలూ.. క్యాబ్‌లో ఒంటరిగా జర్నీ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

    అక్షరటుడే, హైదరాబాద్: Women safety | ఉరుకుల పరుగుల జీవనంలో క్యాబ్‌లలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా మారింది. కానీ,...

    More like this

    Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Junk Craving | జంక్ ఫుడ్ అంటే ఇష్టం లేని వారుండరు. పిజ్జా(Pizza), బర్గర్లు(Burgers),...

    Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | అన్ని రంగాల్లో ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు (EWS Reservations) అమలు చేయాలని ఓసీ...

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...