ePaper
More
    HomeజాతీయంPython Caught | మామిడి తోటలో 15 అడుగుల కొండచిలువ.. కూలీల షాక్

    Python Caught | మామిడి తోటలో 15 అడుగుల కొండచిలువ.. కూలీల షాక్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Python Caught : పచ్చని మామిడి తోట (mango orchard).. ఓ వైపు అడపాదడపా చిరుజల్లులు.. కూలీలు ఆడుతూ పాడుతూ సరదాగా అలసట లేకుండా పని చేసుకుంటున్నారు. ఇంతలో పొదల మాటున అలజడి.. ఏంటా అని నిశితంగా పరిశీలించి షాక్​ అయ్యారు.

    తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar district) కొత్తకోట రూరల్ మండలం చిలకటోనిపల్లి శివారులో భారీ కొండచిలువ ఒక్కసారిగా కనిపించడంతో కూలీలు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ శివారులోని మామిడి తోటలో పనిచేస్తున్న కూలీలు.. పొదల మధ్య సుమారు 15 అడుగుల పొడవున్న భారీ కొండచిలువను చూసి ఆందోళన చెందారు. వెంటనే తోట యజమాని సర్వేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్నేక్ సొసైటీ నిర్వాహకులకు సమాచారం అందించారు.

    Python Caught | అడవిలో వదిలేశారిలా..

    స్నేక్ సొసైటీ నిర్వాహకులు(Snake Society organizers) అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ శివకుమార్, పోలీసుల సహకారంతో ఆ భారీ కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో దానిని సురక్షితంగా వదిలిపెట్టారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్దఎత్తున తరలి వచ్చారు. పామును అక్కడి నుంచి తీసుకెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు. “ఇంత పెద్ద కొండచిలువను జీవితంలో ఇదే తొలిసారి చూడటం” అని పలువురు కూలీలు ఈ సందర్భంగా అన్నారు.

    కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు అటవీ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...