ePaper
More
    HomeజాతీయంGujarat Bridge Collapse | బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు చేరిన మృతులు.. కొనసాగుతున్న సహాయక...

    Gujarat Bridge Collapse | బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు చేరిన మృతులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gujarat Bridge Collapse | గుజరాత్​లో బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. వడోదరా జిల్లాలోని పద్రా వద్ద మహిసాగర్​ నది(Mahisagar River)పై బుధవారం వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఆనంద్​నగర్​, వడోదర(Vadodara)లను కలిపే ఈ వంతెన మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అలాంటి బ్రిడ్జి కూలిపోయే వరకు కూడా అధికారులు గమనించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

    వంతెన కూలిపోవడంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై పలువురిని కాపాడారు. అనంతరం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బుధవారం ఈ ఘటనలో 9 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే గురువారం నాటికి మృతుల సంఖ్య 15కు చేరింది. మరో ముగ్గురి ఆచూకీ తెలియడం లేదు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    READ ALSO  Impeachment Motion | జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను తొలగించాలని ఎంపీల నోటీసులు

    Gujarat Bridge Collapse | కొత్త వంతెన కోసం నిధులు మంజూరు

    మహిసాగర్​ నదిపై వంతెన 1985లో నిర్మాణం పూర్తయింది. వంతెన పాతది కావడం.. వాహనాల రద్దీ పెరగడంతో కొత్త వంతెన నిర్మించాలని గతంలోనే అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ వంతెనపై రాకపోకలు నిషేధించాలని తాము 2017లోనే కోరినట్లు కాంగ్రెస్​ నాయకులు(Congress Leaders) చెబుతున్నారు. అయితే వంతెన పాతది కావడంతో ప్రభుత్వం కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని, మూడు నెలల క్రితమే రూ.212 కోట్లు మంజూరు చేశామని మంత్రి రిశికేష్​ పటేల్(Minister Hrishikesh Patel)​ తెలిపారు. టెండర్లు కూడా మొదలయ్యాయని, అంతలోనే ప్రమాదం జరిగిందన్నారు.

    Latest articles

    SP Rajesh Chandra | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, గాంధారి: SP Rajesh Chandra | భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా...

    Engineering Colleges | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Engineering Colleges | ఇంజినీరింగ్ (Engineering)​, ఇతర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు...

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    More like this