Homeజిల్లాలునిజామాబాద్​Armoor | 149 మంది జూదరుల అరెస్టు.. ఎక్కడంటే..

Armoor | 149 మంది జూదరుల అరెస్టు.. ఎక్కడంటే..

ఆర్మూర్​ నియోజకవర్గంలో దీపావళి సందర్భంగా పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆర్మూర్​ పట్టణంతో పాటు నందిపేట్​లో జూదరులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో దీపావళి పండుగ సందర్భంగా పేకాడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆర్మూర్​ ఎస్​హెచ్​వో సత్యనారాయణ (SHO satyanarayana) తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్​ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో దీపావళి(Diwali) సందర్భంగా 110 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు.

జూదరుల వద్ద నుంచి రూ. 2,46,840 స్వాధీనం చేసుకున్నారు. వారిపై 2 0కేసులు నమోదు చేసినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.

Armoor | నందిపేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..

నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పేకాట స్థావరాలపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్యామరాజ్(SI Shaymraj) తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నందిపేట మండల పరిధిలోని సీహెచ్ కొండూరు, ఐలాపూర్, వన్నెల కే గ్రామాల్లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేపట్టారు.

ఈ సందర్భంగా 39 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1,08,550 నగదు, సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్​ యాక్ట్​ 1867 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.