అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 143 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి (Trainee Collector Caroline Chingtianmavi), డీఆర్డీవో సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డికి (ACP Raja Venkat Reddy) ప్రజలు అర్జీలు స్వీకరించారు. కాగా.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.