అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీపీ సాయిచైతన్య సోమవారం ప్రజావాణి (Prajavani) నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా వింటూ.. పరిష్కార మార్గాలను సూచించారు. సీపీ కార్యాలయంలో (CP Office) నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను విన్న సీపీ సాయిచైతన్య తక్షణమే సంబంధింత స్టేషన్ల సీఐ, ఎస్సైలకు ఫోన్లు ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
CP Sai chaitanya | నిర్భయంగా.. నేరుగా రండి..
ప్రజావాణి సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా నిర్భయంగా పోలీస్ కార్యాలయానికి రావచ్చని సూచించారు. మూడోవ్యక్తి ప్రమేయం లేకుండా.. ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు.