అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | జిల్లా అదనపు మెజిస్ట్రేట్ (Additional District Magistrate) అయిన సీపీ సాయిచైతన్య ఎదుట శనివారం 13 మందిని బైండోవర్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో రాబోయే గణేష్ విగ్రహాల నిమజ్జనం (Ganesh Nimajjanam), మిలాద్-ఉన్-నబి (Milad-un-Nabi), దుర్గామాత (Navaratri Celebrations) ఉత్సవాలు ఉన్నందున సీపీ సాయి చైతన్య ఎదుట పోలీసులు 13 మందిని బైండోవర్ చేశారు.
డీజే ఆపరేటర్లు, డీజే యజమానులు, ట్రబుల్ మాంగర్స్, బోధన్ డివిజన్ పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న 13 మందితో సీపీ వేర్వేరుగా మాట్లాడారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశించారు. డీజే యజమానులకు రూ.2లక్షలు, ట్రబుల్ మాంగర్స్కు (Troublemakers) రూ. లక్ష, డీజే ఆపరేటర్లకు రూ.50వేలు సొంత పూచీకత్తుపై అదనపు మెజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్లీ నేరాలకు పాల్పడినట్లయితే పూచీకత్తు కోసం జమచేసిన డబ్బును జప్తు చేస్తామని.. జైలుశిక్ష విధించబడుతుందని ఆయన హెచ్చరించారు. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, బోధన్ రూరల్ పీఎస్లో 5, ఎడపల్లి పోలీస్ స్టేషన్లో 3 కేసులు, రుద్రూర్ పోలీస్ స్టేషన్లో 3 కేసుల్లో నిందితులను బైండోవర్ చేశారు.