అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunken drive tests | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఇన్ఛార్జి సీపీ రాజేష్ చంద్ర (In-charge CP Rajesh Chandra) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు.
Drunken drive tests | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఈనెల 19వ తేదీ నుంచి 26 వరకు విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు (Drunk driving checks) చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన 129 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిలో 10మందికి వారంరోజుల పాటు జైలుశిక్ష విధించారు. అలాగే 129మందికి రూ.8.80లక్షలు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి సీపీ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.