Homeజిల్లాలునిజామాబాద్​Prajavani | ప్రజావాణికి 128 ఫిర్యాదులు

Prajavani | ప్రజావాణికి 128 ఫిర్యాదులు

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్​ అంకిత్​ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్​లో ఫిర్యాదులు స్వీకరించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 128 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్​తో పాటు డీఆర్డీవో సాయాగౌడ్ (DRDO Sayagoud), నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.