అక్షరటుడే, ఆర్మూర్ :Nandipet | నందిపేట్ మండలంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి(Police Raid) చేశారు. అంతేకాకుండా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బాద్గుణ గ్రామంలో పలువురు పేకాడుతున్నట్లు సమాచారం రావడంతో నందిపేట ఎస్సై చిరంజీవి(SI Chiranjeevi) ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. ఈ సమయంలో పేకాడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 2,12,520 నగదు, 10 సెల్ ఫోన్లు, రెండు కార్లు, రెండు బైకులను సీజ్చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై(SI) తెలిపారు.