అక్షరటుడే, వెబ్‌డెస్క్: Germany | జర్మనీలో దారుణం చోటు చేసుకుంది. ఇక్కడి హాంబర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్(Hamburg Central Railway Station)లో జరిగిన కత్తి దాడిలో కనీసం 12 మంది గాయపడ్డారు.
ప్లాట్‌ఫామ్‌పై నిలుచున్న వారిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇది అత్యంత పెద్ద ఘటనగా అభివర్ణించిన పోలీసులు.. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 13, 14 ట్రాక్‌ల మధ్య ప్లాట్‌ఫామ్‌పై వ్యక్తి కత్తితో ప్రజలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలు తెలియలేదని పోలీసులు చెప్పారు.
“ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రధాన రైలు స్టేషన్‌లో ఒక వ్యక్తి కత్తితో అనేక మందిని గాయపరిచాడు” అని హాంబర్గ్ పోలీసులు ‘X’లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
జర్మనీలో రెండవ అతిపెద్ద నగరం అయిన హాంబర్గ్ డౌన్‌టౌన్(Hamburg Downtown)లో ఉన్న ఈ స్టేషన్.. సుదూర ప్రయాణాలకు కీలకమైన కేంద్రంగా ఉంది. స్టేషన్‌లోని కొన్ని భాగాలను పోలీసులు చుట్టుముట్టారని అసోసియేటెడ్ ప్రెస్ associated press నివేదించింది. ఇటీవలి నెలల్లో జర్మనీలో కత్తిపోట్లు సహా వరుస హింసాత్మక సంఘటనలు జరిగాయి. గత ఆదివారం బీలేఫెల్డ్(Bielefeld)లోని ఒక బార్‌లో జరిగిన కత్తిపోటులో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.