HomeUncategorizedTalliki Vandanam | ఒకే కుటుంబంలో 12 మంది పిల్లలు.. తల్లికి వందనం కింద రూ.1.56...

Talliki Vandanam | ఒకే కుటుంబంలో 12 మంది పిల్లలు.. తల్లికి వందనం కింద రూ.1.56 లక్షలు జమ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Talliki Vandanam | ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తల్లికి వందనం పథకాన్ని (Talliki Vandanam Scheme) ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్​ సెకండియర్​ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తోంది. అందులో నుంచి రూ.13 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. మిగతా రూ.రెండు వేలు విద్యా సంస్థల అభివృద్ధికి వినియోగించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద నిధులు జమ చేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేట్​, ఎయిడెట్​ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం కింద నగదు అందిస్తున్నారు. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో ఒక ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు ఉండగా.. అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి.

అన్నమయ్య (Annamayya) జిల్లా కలకడలోని ఓ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు కలిసే ఉంటున్నారు. ఆ కుటుంబంలో మొత్తం 12 మంది పిల్లలు చదువుకుంటున్నారు. దీంతో వారందరికి తల్లికి వందనం కింద నిధులు జమ అయ్యాయి. మొత్తం ఆ కుటుంబానికి రూ.1.56 లక్షలు జమ కావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు (Kurnool) జిల్లా దేవనకొండకు చెందిన దంపతులకు ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. వారందరూ ప్రభుత్వ బడుల్లోనే చదువుతున్నారు. దీంతో వారికి కూడా తల్లికి వందనం కింద రూ.78 వేలు ఖాతాలో జమ అయ్యాయి. దీంతో వారి తల్లి షకినాబి, తండ్రి చాంద్‌బాషా సంతోషం వ్యక్తం చేశారు.