అక్షరటుడే, వెబ్‌డెస్క్: BSF Posts | వివిధ పోస్టుల భర్తీ కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Directorate General Border Security Force) నోటిఫికేషన్ జారీ చేసింది. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) గ్రూప్ సి నాన్ గెజిటెడ్ (Non Gazetted) పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ ఆదివారం ప్రారంభమై వచ్చేనెల 23 వరకు కొనసాగనుంది. అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి.
మొత్తం భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 1,121
BSF Posts | పోస్టుల వారీగా వివరాలు..
1. హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 910
2. హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 211
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ(ITI) సర్టిఫికెట్ లేదా 60 శాతం మార్కులతో ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగినవారు అర్హులు.
వయోపరిమితి : 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. ఓబీసీ(OBC)లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు : నెలకు రూ. 25,500 – రూ. 81,100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు రుసుము : జనరల్(General), ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 23.
ఎంపిక విధానం : ఫస్ట్ ఫేజ్‌లో ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్(PST), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET)నిర్వహిస్తారు.
సెకండ్ ఫేజ్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) ఉంటుంది. ఇది హిందీ, ఇంగ్లిష్ మీడియంలలో మాత్రమే ఉంటుంది. థర్డ్ ఫేజ్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. హెచ్‌సీ ఆర్‌వో పోస్టులకు డిక్టేషన్, పారాగ్రాఫ్ రీడిరగ్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్‌ల తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి, పూర్తి వివరాల కోసం https://rectt.bsf.gov.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించండి.