అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sankranthi Special Trains | సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం నగరాల్లో నివసిస్తున్న చాలా మంది ఈ సమయంలో సొంతూళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబరాలు జరుపుకుంటారు. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడపనుంది. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 11 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
Sankranthi Special Trains | జనవరి 7 నుంచి..
సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అదనంగా 11 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించారు. ఈ రైళ్లు కాకినాడ టౌన్-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, సికింద్రాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-కాకినాడ టౌన్ మార్గాల్లో నడుస్తాయి. ఈ సేవల్లో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ తో పాటు సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయి. ఈ స్పెషల్ ట్రెయిన్ల టికెట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమైనట్లు రైల్వే అధికారులు (Railway Officers) తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలివే..
- రైలు నంబర్ 07460 (కాకినాడ టౌన్ – వికారాబాద్) : జనవరి 8న సాయంత్రం 6:20 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07461 (వికారాబాద్ – పార్వతీపురం): జనవరి 9, 11 తేదీల్లో సాయంత్రం 8:30 గంటలకు వికారాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 2:30 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07462 (పార్వతీపురం – వికారాబాద్): జనవరి 10న సాయంత్రం 6:30 గంటలకు పార్వతీపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:30 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07463 (పార్వతీపురం – కాకినాడ టౌన్): జనవరి 12న సాయంత్రం 6:30 గంటలకు పార్వతీపురంలో బయలుదేరి, మరుసటి రోజు అర్ధరాత్రి 1:00 గంటకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07464 (సికింద్రాబాద్ – పార్వతీపురం): జనవరి 8న రాత్రి 11:00 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07465 (పార్వతీపురం – సికింద్రాబాద్): జనవరి 9న సాయంత్రం 6:30 గంటలకు పార్వతీపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:00 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07186 (కాకినాడ టౌన్ – వికారాబాద్): జనవరి 7, 9 తేదీల్లో సాయంత్రం 4:45 గంటలకు కాకినాడ్ టౌన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు వికారాబాద్‌కు చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07185 (వికారాబాద్ – కాకినాడ టౌన్): జనవరి 8న సాయంత్రం 5:35 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
- రైలు నంబర్ 07187 (వికారాబాద్ – కాకినాడ టౌన్): జనవరి 10న సాయంత్రం 7:00 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
- కొన్ని రైళ్ల (07460, 07461, 07186, 07185, 07187) బుకింగ్‌లు డిసెంబర్ 29 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు సకాలంలో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.