Homeతెలంగాణ108 Ambulance​ | 108 సిబ్బంది సమయస్ఫూర్తి.. అంబులెన్సు లోనే గర్భిణికి ప్రసవం

108 Ambulance​ | 108 సిబ్బంది సమయస్ఫూర్తి.. అంబులెన్సు లోనే గర్భిణికి ప్రసవం

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: 108 Ambulance​ | గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 వాహనంలోనే పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్​ సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో 108 వాహనంలోనే ప్రసవం జరిగింది.

అంబులెన్స్​ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండలం మాచర్ల గ్రామానికి చెందిన రవితకు ఆదివారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది హుటాహుటిన గర్భిణి ఇంటికి చేరుకుని ఆమెను దేగాం​ ప్రభుత్వ ఆస్పత్రికి (Degam Government Hospital) తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్​ సిబ్బంది సాధారణ ప్రసవం చేశారు.

అనంతరం అంబులెన్స్​లో ఆమెను దేగాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. 108 సిబ్బంది ఈఎంటీ(EMT) శాంతా, పైలెట్ రమేష్, ఆశా వర్కర్ పుష్పకు (Asha worker) కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Must Read
Related News