Pakistanis | పాకిస్తానీయులపై కేంద్రం కఠిన చర్యలు..వారికి రూ.3 లక్షల జరిమానా, మూడేళ్ల జైలు
Pakistanis | పాకిస్తానీయులపై కేంద్రం కఠిన చర్యలు..వారికి రూ.3 లక్షల జరిమానా, మూడేళ్ల జైలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :India – pak | పహల్​గామ్​లో ఉగ్రదాడి(Terror Attack) తర్వాత భారత్​–పాక్​ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక పాక్(Pakistan)​ హస్తం ఉందని.. కేంద్ర ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగా షార్ట్​ వీసా(Short Visa)తో భారత్​లో ఉన్న పాక్​ పౌరులను వెనక్కి పంపించాలని ఆదేశించింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాక్​ పౌరులకు (Pakistani Citizens) నోటీసులు ఇస్తున్నాయి. ఇప్పటికే పలువురు పాక్​ వెళ్లిపోగా.. మరికొందరు వెళ్తున్నారు. అయితే మహారాష్ట్రలో మొత్తం 5,023 మంది పాకిస్తానీ జాతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో షార్ట్​ టర్మ్ వీసా(Short Term Visa) ఉన్న 250 మందిని వెనక్కి పంపిస్తున్నట్లు వివరించారు.

మహారాష్ట్ర(Maharashtra)లోని పాక్​ పౌరుల్లో 107 మంది ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. వారు ఇండియా(India)లోకి ప్రవేశించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారా? లేదా అందుబాటులో లేకుండా పోయారా? అనేది క్లారిటీ లేదు. మరో 34 మంది పాకిస్తానీయులు మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే కనిపించకుండా పోయిన ఆ 107 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు.