Prajavani
Prajavani | ప్రజావాణికి 106 ఫిర్యాదులు

అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో (Collectorate Nizamabad) సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. సమస్యలను కలెక్టర్​తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్ (ZP CEO Sayagoud), నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్, ఏసీపీలు రాజావెంకట్ రెడ్డి, శ్రీనివాస్​కు సమర్పించారు.