అక్షరటుడే, బీర్కూర్: Panchayat Elections | పండుటాకు అయినప్పటికీ.. ప్రజాస్వామ్యంపై.. ఓటు హక్కుపై ఆమెకు ఉన్న నిబద్ధత అందరికీ స్ఫూర్తినిస్తోంది. 105 ఏళ్ల వయస్సులోనూ ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి (polling station) వచ్చి ఓటు వేసిన వృద్ధురాలు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
Panchayat Elections | బీర్మూర్ మండలంలో..
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి (Birkur mandal) చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు కొర్రి నాగమ్మ బుధవారం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వయస్సు పైబడినప్పటికీ ఎలాంటి అలసట లేకుండా ఆమె వీల్చైర్లో వచ్చి ఓటువేశారు.
ఒక్కసారి కూడా ఓటు వేయకుండా ఉండలేదు..
తనకు ఓటు హక్కు వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓటు వేయకుండా ఉండలేదని కొర్రి నాగమ్మ పేర్కొన్నారు. ఉన్నన్ని రోజులు నా ఓటు హక్కును వినియోగించుకుంటానని, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మన బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ ఓటు వేయాలని బాధ్యతగా వ్యవహరించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.