Homeటెక్నాలజీBSNL | రూ.999కే 100Mbps సిమ్-రహిత 5G ఇంటర్నెట్‌.. BSNL అద్భుత ఆఫర్​..

BSNL | రూ.999కే 100Mbps సిమ్-రహిత 5G ఇంటర్నెట్‌.. BSNL అద్భుత ఆఫర్​..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BSNL : హైదరాబాద్‌లో BSNL అధికారికంగా తన క్వాంటం 5G(Quantum 5G) (Q-5G) సేవలను ప్రారంభించింది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ రేసులోకి ప్రవేశించడంతో పాటు జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ టెల్కోలను ఎదుర్కోబోతోంది.

బీఎస్​ఎన్​ఎల్​ తాజా ప్యాకేజీని రూ.999కు 100Mbps వేగాన్ని అందిస్తోంది. ప్రీమియం ప్లాన్​ల్​ భాగంగా రూ.1,499 కు 300Mbpsని తీసుకొచ్చింది.

BSNL Q-5G FWA అంటే ఏమిటి?

క్వాంటం 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (Fixed Wireless Access – FWA) సొల్యూషన్ అనేది టైర్-2, టైర్-3 నగరాల కోసం రూపొందించారు. ఈ ప్రాంతాల్లో ఫైబర్ ఇంటర్నెట్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. ప్రైవేట్ టెలికాం ప్లేయర్లు సంప్రదాయకంగా తక్కువగా సేవలు అందించే ప్రాంతాలలోని గృహాలు, కార్యాలయాలు, చిన్న వ్యాపారాలకు నమ్మకమైన, వేగవంతమైన కనెక్టివిటీని అందించడం BSNL ప్రధాన లక్ష్యం.

BSNL : తదుపరి నగరాలు..

హైదరాబాద్ (Hyderabad) తర్వాత, BSNL తన Q-5G FWA సేవలను మరికొన్ని నగరాల్లో సాఫ్ట్-లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. అవేంటంటే..

  • బెంగళూరు Bengaluru
  • విశాఖపట్నం Visakhapatnam
  • పుణె Pune
  • చండీగఢ్ Chandigarh
  • గ్వాలియర్ Gwalior

BSNL : సిమ్, వైరింగ్ లేకుండా 5G ఎలా పని చేయగలదంటే..

Q-5G సేవ BSNL యొక్క 5G టవర్‌లకు వైర్‌లెస్‌గా కనెక్ట్ అయ్యే ప్రత్యేక ఇండోర్ రౌటర్‌లపై ఆధారపడుతుంది. ఇది సిమ్​, వైరింగ్​ అవసరాన్ని లేకుండా చేస్తుంది.