ePaper
More
    Homeభక్తిSrirangam | అద్భుతం.. వెయ్యేళ్లకు పైగా ఆయన దేహం ఈ ఆల‌యంలో భద్రం..!

    Srirangam | అద్భుతం.. వెయ్యేళ్లకు పైగా ఆయన దేహం ఈ ఆల‌యంలో భద్రం..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Srirangam | భారతదేశం అతి ప్రాచీన ఆలయాలకు నెలవుగా చెప్ప‌వ‌చ్చు. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ముఖ్యంగా తమిళనాట అతి ప్రాచీన ఆలయాలు దర్శించుకోవచ్చు. త‌మిళనాడులోని(Tamilnadu) తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం ఆల‌యం ఎంతో ప్రాశ‌స్త్యం చెందింది. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం(Srirangam) ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల(Sri Ramanujacharyulu) వారి శరీరం.

    Srirangam | మ‌హాద్భుతం..

    శ్రీరామానుజాచార్యులు (Sri Ramanujacharyulu) పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా కూడా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా… అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం (divine body) అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

    క్రీస్తు శకం 11 – 12 శతాబ్దాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో(Srirangam) శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. అయితే రామానుజాచార్యుల మాదిరిగానే 15వ శతాబ్దంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్థీవ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ (Goa Basilica of Bomb) అనే చర్చిలో భద్రపరిచారు. శ్రీరంగం దేవాలయం (Srirangam temple) 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది. భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది. రంగనాథస్వామి (Ranganathaswamy) కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది. పైకప్పుకు బంగారు తాపడం చేశారు. గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న స్వామిని చూడడానికి రెండు కళ్లు కూడా చాలవు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...