అక్షర టుడే, బోధన్: Saloora | గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని డీపీవో శ్రీనివాస్ (DPO Srinivas) అన్నారు. సాలూర గ్రామ పంచాయతీని (Saloora Gram Panchayat) బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న పనులపై అడిగి తెలుసుకున్నారు. కంపోస్ట్ షెడ్ నిర్మాణం కోసం స్థలం కేటాయింపుపై తహశీల్దార్ శశిభూషణ్‌కు సూచనలు చేశారు.
అనంతరం పలు గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ గృహం (Indiramma house) నిర్మించాలని తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. అభివృద్ధి పనుల ఆన్‌లైన్ ప్రక్రియపై కార్యాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, డీఎల్పీవో నాగరాజు, బోధన్ ఎంపీడీవో మధుకర్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులున్నారు.
