అక్షరటుడే, హైదరాబాద్: DGP Jitender FLOOD NEWS : తెలంగాణ రాష్ట్రంలో ముంచుకొచ్చిన వరదల్లో ఇప్పటివరకు 10 మంది చనిపోయినట్లు సమాచారం అందిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2 వేల మందిని వరదల నుంచి రక్షించినట్లు డీజీపీ పేర్కొన్నారు. హెలికాప్టర్, ఆర్మీ సాయంతో వరదల నుంచి ప్రజలను రక్షించినట్లు వెల్లడించారు.
DGP Jitender FLOOD NEWS : 2 వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్‌ఎఫ్ ఏర్పాటు
అతి భారీ వర్షాల నేపథ్యంలో 2 వేల మంది సిబ్బందితో ఎస్డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారన్నారు.
సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్ NDRF, ఎస్డీఆర్‌ఎఫ్ SDRF చురుగ్గా పనిచేస్తున్నాయని డీజీపీ తెలిపారు. ఇంత భారీ వర్షం కురిసినా ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఒకవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఉన్నప్పటికీ వరదల్లో పోరాటం చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు. గతేడాది నుంచి ఎస్డీఆర్‌ఎఫ్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని డీజీపీ అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ
తాము హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Center) నుంచి ఆదేశాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నామని డీజీపీ తెలిపారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీజీపీ పేర్కొన్నారు.
కామారెడ్డి (Kamareddy), సిద్దిపేటలో ప్రధాన రహదారులు ధ్వంసమయ్యాయని డీజీపీ జితేందర్ తెలిపారు. మెదక్ జిల్లాలో రైల్వే ట్రాక్ కూడా పూర్తిగా ధ్వంసమైందన్నారు.