అక్షరటుడే, వెబ్డెస్క్: Schengen visa | విదేశాలకు వెళ్లే భారతీయులకు ప్రధానంగా ఐరోపా దేశాల(European countries)కు వెళ్లే వారికి తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యాయి. ఐరోపా దేశాల్లో పర్యటనకు అవసరమైన షెంజెన్ వీసా(Schengen visa) దరఖాస్తుల్లో గతేడాది లక్షల సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి.
అప్లికేషన్లు రిజెక్టు అయిన దేశాల జాబితాలో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. 2024లో భారతీయులకు చెందిన 1.65 లక్షల అప్లికేషన్లు తిరస్కరణకు గురి కాగా, దరఖాస్తుదారులు దాదాపు రూ.136 కోట్లు నష్టపోయారు. షెంజెన్ వీసాల(Schengen visa) తిరస్కరణలతో భారతీయులు భారీగా నష్టపోతున్నారు. వీసా దరఖాస్తు కోసం కట్టిన ఫీజులు నాన్ రిఫండబుల్ కావడంతో తిరస్కరణలు మనవాళ్లకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. వీసా తిరస్కరణకు గురవుతున్న దేశాల్లో ఆల్జీరియా(1,85,101), టర్కీ(1,70,129) తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు యూరోపియన్ కమిషన్ (European Commission) డాటా వెల్లడిస్తోంది. ఇండియన్ల వీసా దరఖాస్తుల తిరస్కరణ రేటు 15 శాతంగా ఉన్నట్లు తేలింది.
Schengen visa | 11 లక్షల అప్లికేషన్లు..
ఇండియన్లకు చెందిన షెంజెన్ వీసాల(Schengen visa) దరఖాస్తులు రిజక్ట్ చేసిన దేశాల్లో ఫ్రాన్స్(France) మొటదటి స్థానంలో నిలిచింది. ఆ దేశం 31 వేల అప్లికేషన్లను రద్దు చేసింది. అలాగే స్విట్జర్లాండ్ (26 వేలు), జర్మనీ (15వేలు) , స్పెయిన్ (15 వేలు), నెదర్లాండ్స్ (14.5వేలు) దరఖాస్తులను తిరస్కరించింది. స్లోవేకియాకు వీసా కోసం అత్యల్పంగా 1,278 మంది భారతీయులు దరఖాస్తు చేసుకోగా, అందులో సగం రిజెక్ట్ కావడం గమనార్హం. గతేడాది ఇండియన్లు చేసుకున్న దరఖాస్తుల్లో భారీగానే తిరస్కరణకు గురయ్యాయని కాండీ నాస్ట్(Candy Nast) సంస్థ డేటా వెల్లడించింది.
నిరుడు భారత్ నుంచి 11.08 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 5.91 అప్లికేషన్లకు అమోదం లభించగా 1.65 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. మొరాకో, చైనా దేశస్థుల వీసా దరఖాస్తులు కూడా అధిక సంఖ్యలో రిజెక్ట్ అయ్యాయి. గతేడాది షెంజెన్ సభ్య దేశాలకు మొత్తం వచ్చిన వీసాల్లో దాదాపు 17 లక్షల దాకా అక్కడి అధికారులు తిరస్కరించారు. ఈ దరఖాస్తుల ఫీజుల ద్వారా దాదాపు రూ.1,410 కోట్ల మేర ఆయా దేశాలకు ఆదాయం లభించింది. ఇందులో భారతీయుల సొమ్మే రూ.136 కోట్లు ఉండడం విశేషం. ఇదంతా నాన్ రిఫండబుల్ కావడంతో అభ్యర్థులు నష్టపోయారు.
Schengen visa | వీసాల తిరస్కరణలో ఫ్రాన్స్ ఫస్ట్
భారతీయుల షెంజెన్ వీసా(Schengen visa) దరఖాస్తులను తిరస్కరించిన దేశాల్లో ఫ్రాన్స్(France) మొదటి స్థానంలో ఉంది. మొత్తం 31,314 వీసాలు ఫ్రాన్స్ ప్రభుత్వం తిరస్కరించింది. ఆ తరువాత స్థానాల్లో స్విట్జర్‌ల్యాండ్(Switzerland) (26,126), జర్మనీ(Germany) (15,806), స్పెయిన్(Spain) (15,150), నెదర్‌ల్యాండ్స్(Netherlands) (14,569) ఉన్నాయి.
మరోవైపు దరఖాస్తుల ఫీజు పెంపు కూడా భారతీయుల నష్టాలను పెంచింది. గతంలో వీసా ఫీజు 80 యూరోలుగా ఉండగా ప్రస్తుతం ఇది 90 యూరోలకు చేరుకుంది. 12 ఏళ్లు పైబడిన వారందరిపైనా ఫీజుల భారం పెరిగింది. చిన్నారులు, విద్యార్థులు, ఎన్జీవో ప్రతినిధులు, ఇతర ప్రత్యేక కేసుల్లో మాత్రం మినహాయింపు కల్పించారు. దరఖాస్తుల రిజెక్ట్‌తో తీవ్రంగా నష్టపోతున్న ఇండియన్లు.. వీసా నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.