ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​New Flight Service | విజయవాడ-కర్నూలు మధ్య నూతన విమాన సర్వీసు.. ఈ రోజు నుంచే...

    New Flight Service | విజయవాడ-కర్నూలు మధ్య నూతన విమాన సర్వీసు.. ఈ రోజు నుంచే ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:New Flight Service | విజయవాడ – కర్నూలు(Vijayawada-Kurnool) మధ్య నూతన విమానస‌ర్వీసు ఈ రోజు (జూలై 2) నుండి ప్రారంభం కానుంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రారంభిస్తున్న ఈ రూట్‌లో ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారంలు రెగ్యులర్‌గా విమాన సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ విమాన మార్గం వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తక్కువయ్యే అవకాశం ఉండడంతో వ్యాపారప‌రంగా ప్ర‌యాణించే ప్రయాణికులు, సాధారణ ప్రయాణికులకు ఇది ఎంతో వెసులుబాటుని క‌ల్పిస్తుంది.

    New Flight Service | నేటి నుంచి అందుబాటులోకి..

    ఇప్పటికే విమాన టికెట్ల(Flight Tickets)పై ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. విమాన సర్వీసును ప్రారంభిస్తున్న ఎయిర్‌లైన్(Airline) సంస్థ అధికారికంగా సమాచారం వెల్లడిస్తూ, “ప్రతి వారం మూడుసార్లు ఈ విమాన సేవ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతి అందించడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ నూతన విమాన సర్వీసు(New Flight Service )తో రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మరింత బలపడనుందని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆశయానికి కేంద్రం మెరుగైన సహకారం అందిస్తోంది. ఇప్పటికే అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ(Prime Minister Modi) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    ఈ క్రమంలోనే కేంద్ర పౌరవిమానయాన శాఖ, అమరావతి(Amaravati)ని రాయలసీమ ప్రాంతంతో మరింత బలంగా అనుసంధానించేందుకు విజయవాడ – కర్నూలు మధ్య నూతన విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ విమాన సర్వీసును ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో(Airline company IndiGo) నిర్వహించనుంది. ఈ కొత్త విమాన మార్గం ద్వారా రాజధాని ప్రాంతానికి రాయలసీమ నుండి ప్రయాణించే ప్రజలకు ఎంతో మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. ఇది కేవలం విమాన సౌకర్యమే కాకుండా, ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే కీలక అడుగుగా నిలవనుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

    ఇదిలా ఉండగా, విజయవాడ – కర్నూలు మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్(AP Minister TG Bharat) కేంద్ర మంత్రిని కోరిన విషయం తెలిసిందే. ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు, తక్కువ సమయంలోనే సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. అమరావతిని రైలు మార్గాలతోనే కాదు, విమాన మార్గాలతో కూడా అనుసంధానం చేయాలని కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, రాబోయే రోజుల్లో మరిన్ని కనెక్టివిటీ ప్రాజెక్టులపై పనిచేస్తామని కేంద్ర మంత్రిత్వ శాఖ వర్గాలు తెలియజేశాయి. ఈ కొత్త సేవ‌తో ప్ర‌జ‌ల‌కు వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

    More like this

    Milad Un Nabi | మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ర్యాలీలు

    అక్షరటుడే, బోధన్ : Milad Un Nabi | పట్టణంలో మిలాద్​ ఉన్​ నబీ(Milad Un Nabi) సందర్భంగా...

    Stock Markets | చివరలో ప్రాఫిట్‌ బుకింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | టారిఫ్‌ల విషయంలో అనిశ్చితి(Tariff uncertainty) కొనసాగుతుండడం, ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా పెట్టుబడులు...

    Telangana University | తెయూలో విద్యార్థుల ఆందోళన: హెల్త్​కేర్​ సెంటర్​లో ఔషధాలు ఉంచాలని డిమాండ్​

    అక్షరటుడే,డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హెల్త్​కేర్​ సెంటర్​ (Healthcare Center) ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళనకు...