ePaper
More
    HomeతెలంగాణIndiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్​న్యూస్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో లబ్ధిదారుల జాబితా ఫైనల్​ కానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త చెప్పింది.
    ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునే వారికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గనులు, భూగర్భ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 112 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అందించనున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి సీనరేజీ ఛార్జీలు, రవాణా భారం పడకుండా ఇసుక సరఫరా చేయనున్నారు. ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 25 క్యూబిక్‌ మీటర్లు చొప్పున ఇసుకను సరఫరా చేస్తారు.

    Indiramma Houses | షరతులతో ఆందోళన

    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం పలు షరతులు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులలోపు ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే సాయం అందనుంది. దీంతో చాలా మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు వెనకడుగు వేస్తున్నారు. ఎలాగు ఇల్లు కట్టుకుంటున్నాం, మంచిగా కట్టుకుందామని చాలా మంది భావిస్తారు. అయితే ప్రభుత్వం 600 చదరపు అడుగుల లోపు కట్టుకోవాలని చెప్పడంతో ఎంతో మంది ఈ పథకానికి దూరం కానున్నారు.

    More like this

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....

    Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమా. .! పోలీస్‌ రాజ్యమా..?

    అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్‌ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌...

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...