HomeతెలంగాణKalvakuntla Kavitha | అవకాశం.. అధికారం.. ఆత్మగౌరవం కోసమే జాగృతి పోరాటం: కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha | అవకాశం.. అధికారం.. ఆత్మగౌరవం కోసమే జాగృతి పోరాటం: కల్వకుంట్ల కవిత

అవకాశం అధికారం ఆత్మగౌరవం కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుందని కవిత పేర్కొన్నారు. ఈ మేరకు నిజామాబాద్​ నగర శివారులోని ఓ హోటల్​లో విలేకరులతో ఆదివారం మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Kalvakuntla Kavitha | అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కోసమే తెలంగాణ జాగృతి (Telangana Jagruthai) పనిచేస్తుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జనం బాటకు విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. నవీపేట మండలం యంచ గ్రామంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) ముందుకు రావాలన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అలసత్వం వల్ల క్వింటాలుకు రూ.700 నష్టం వాటిల్లిందని ఆరోపించారు. అలాగే మక్కకు కూడా కనీస మద్దతు ఇస్తామని చెప్పినా.. ఇవ్వడం లేదన్నారు.

Kalvakuntla Kavitha | ఎంపీ అర్వింద్​తో సహా ఎంపీలంతా రాజీనామా చేయాలి

జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల కోసం, అలాగే బీసీ బిల్లు కోసం ఎంపీ అర్వింద్​ రాజీనామా చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్​రెడ్డి ఇంటి ముందో.. ప్రధాని మోదీ ఇంటి ముందో ధర్నా చేయాలని డిమాండ్​ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎంపీ అర్వింద్​తో సహా ఎనిమిది మంది ఎంపీలంతా కలిసి రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్​ బిల్లు నడుచుకుంటూ వస్తుందని ఆమె జోస్యం చెప్పారు.

గతంలో ఎంపీ అర్వింద్ (Mp Arvind)​ మాట్లాడుతూ తనను కే టాక్స్ అనేవాడని, మరి ఇప్పుడు ఏం టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వట్లేదన్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని.. కానీ విద్యార్థుల భవిష్యత్తు పట్టదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Kalvakuntla Kavitha | జూబ్లీహిల్స్​ ఎన్నికలకు మాకు సంబంధం లేదు..

రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలనలో మైనారిటీ శాఖకు మంత్రి లేని మొట్టమొదటి ప్రభుత్వం ఇదేనని కవిత వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు ఆత్మగౌరం లేకుండా పోయిందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలతో తమకు సంబంధం లేదని, తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదన్నారు. జాగృతి క్యాడర్ హైదరాబాద్ మొత్తం ఉందన్నారు. జూబ్లీహిల్స్​లోని తమ క్యాడర్ వారి ఇష్ట ప్రకారం ఎవరికైనా ఓట్లు వేయొచ్చు అని అన్నారు.

Must Read
Related News